స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ హీరో అతి చిన్న వయసులోనే సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో అల్లు అర్జున్ నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. అనంతరం ఈ హీరో నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇక పుష్ప సినిమాతో ఏకంగా అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం అందుకున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు.



ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 సినిమాను కూడా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమా అత్యంత ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప-2 సినిమా నిలవడం విశేషం. ఈ సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నప్పటికీ అల్లు అర్జున్ నటించిన తదుపరి సినిమాకు ఇంకా కామిట్ కానట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ తన తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ లేదా అట్లీ దర్శకత్వంలో నటిస్తారని సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను దర్శకుడు అట్లీతో కలిసి తీయబోతున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రియాంక చోప్రా రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ఎస్ఎస్ఎంబి29 సినిమాలు హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి ప్రియాంక చోప్రా అల్లు అర్జున్ నటించబోయే సినిమాలో హీరోయిన్ గా చేస్తారా లేదా అనే సందేహంలో అల్లు అర్జున్ అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ తో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించినట్లయితే ఆ సినిమా హైలెట్ అవుతుందని అల్లు అర్జున్ అభిమానులు సంబరపడుతున్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: