టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నటి రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చలో సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న ఈ చిన్నది మొదటి సినిమాతోనే సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. ఆ సినిమా అనంతరం ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. దాదాపు ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు పదేళ్లకు పైనే అవుతున్నప్పటికీ ఏమాత్రం వెనుదిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది.



తన నటన, అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా హిందీలోనూ అనేక సినిమాలలో నటిస్తోంది. రీసెంట్ గా ఈ చిన్నది నటించిన సికిందర్, చావా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ఈ సినిమా అనంతరం ప్రస్తుతం రష్మిక తన తదుపరి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. రష్మిక చేతిలో దాదాపు నాలుగైదు సినిమా ప్రాజెక్టులు ఉండడం విశేషం. ఇదిలా ఉండగా.... నేషనల్ క్రష్ రష్మిక మందనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. రష్మికకు గతంలో అల్లు అర్జున్ భార్య ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


అయితే పుష్ప-1 సినిమా సమయంలో వీరిద్దరి మధ్య కాస్త రొమాంటిక్ సన్నివేశాలు రావడం వల్ల తన భర్తతో క్లోజ్ గా ఉండకూడదని స్నేహ రెడ్డి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. స్నేహ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన అనంతరం రష్మిక అల్లు అర్జున్ తో కాస్త దూరంగా ఉందని వార్తలు వైరల్ అయ్యాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా... ఈరోజు రష్మిక తన పుట్టినరోజు. ఈ సందర్భంగా తనకు ఎంతోమంది సినీ నటులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: