
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, మహేష్ బాబుని ప్రేమించిందట. వీరిద్దరూ కలిసి బిజినెస్ మ్యాన్ సినిమా చేస్తున్న సమయంలో కాజల్, ప్రిన్స్ ని లవ్ చేసిందట. అప్పటికే మహేష్ బాబుకి పెళ్లి అయిపోవడంతో, అంతగా ఈ విషయం బయటికి రాలేదంట. అలాగే కాజల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు డిజాస్టర్ మూవీ అయిన బ్రహ్మోత్సవం సినిమా తన ఫేవరెట్ సినిమా అని చెప్పింది. దీంతో కొన్ని రోజులు సినీ ఇండస్ట్రీలో ఈ విషయం గురించి గుసగుసలు కూడా అయ్యాయి.
ఇదిలా ఉండగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఎట్టకేలకు సినిమా రాబోతుంది. ఎస్ఎస్ఎంబి 29 మూవీ షూటింగ్ కూడా మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు, జక్కన్న కాంబోలో వస్తున్న ఈ సినిమాలో నుంచి ఒక్క పిక్ కూడా లీక్ అవ్వకోడదని ప్రిన్స్ మహేష్ బాబుతో, జక్కన్న ముందే నో మోర్ లీక్స్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హోలీ పండుగకి మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, జకన్నతో కలిసి ఒడిశాలో షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లు ఉంటుందని సమాచారం.