స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ వరుస సినిమాలో దూసుకెళ్తున్నాడు. సిద్దు మొదట జోష్, ఆరంజ్, భీమిలి సినిమాలలో సహాయక పాత్రలలో నటించాడు. ఆ తర్వాత డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) అనే సినిమాతో సిద్దు హీరోగా సినీ ఇండస్ట్రీకి పరిచేయమయ్యడు. యంగ్ బాయ్ సిద్దు బీటెక్ పూర్తి చేసిన వెంటనే సినిమాలలో నటించడం ప్రారంభించాడు. ఇతను నటిస్తూనే ఎంబీయే పూర్తి చేశాడు. సిద్దు నటనతో పాటుగా సంగీతం, నృత్యంలో కూడా మంచి పట్టు ఉంది.

ఇక స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు, టిల్లు స్కేర్ సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ రెండు సినిమాలతో సిద్దు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం స్టార్ బాయ్ జాక్ అనే సినిమాతో ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాకి కొంచెం క్రాక్ అని ఉపశీర్షికని కూడా పెట్టారు. ఈ సినిమాకు బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.  జాక్ సినిమాకు  బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాలో సిద్దుకి జోడీగా తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య నటిస్తుంది. ఈ సినిమా ఒక్క మంచి కామిడీ టైమింగ్ తో చక్కగా వినోదాన్ని పంచుతుందని సమాచారం. ముఖ్యంగా జాక్ సినిమా యువతకు చాలా నచ్చుతుందని.. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని దర్శకుడు భాస్కర్ తెలిపారు.

అయితే తాజాగా సిద్దు జొన్నలగడ్డ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సినిమాలో ఏదైనా సీన్ విషయంలో అభిప్రాయ భేదాలు రావడం మామూలు విషయం. కథ ఒక్కటే అయినప్పటికీ.. దాన్ని ప్రేక్షకులకు ఎలా చూపించాలి అనే దానిపైన డిష్కసన్స్ జరుగుతున్నప్పుడు అభిప్రాయం వేర్వేరుగా వస్తుంటాయి. ఇది క్రియేటివ్ డిఫరెన్స్ కి ఒక ఉదాహరణ' అని టిల్లు క్లారిటీ ఇచ్చారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: