బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో గుర్తింపు అందుకుంటారు. అలాంటి వారిలో నటి కంగనా రనౌత్ ఒకరు. ఈ చిన్నది బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. కేవలం హిందీలోనే కాకుండా తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకుంది. కంగనా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ చాలా చురుగ్గా ఉంటారు. అంతేకాకుండా కంగనా రనౌత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. 

తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతూ ఉంటాయి. ఇది ఇలా ఉండగా.... ప్రస్తుతం కంగనా బాలీవుడ్ అవార్డులను ఉద్దేశించి కొన్ని సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రీసెంట్ గా కంగనా తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమా మంచి సక్సెస్ సాధించింది.


సినిమా జనవరి 17న థియేటర్లలో విడుదలై డిజాస్టర్ గా నిలిచినప్పటికీ ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. అయితే కంగనా తెరకెక్కించిన ఈ సినిమాను మెచ్చి ఓ వ్యక్తి కంగనాకు చీరను గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. అయితే ఈ చీరను కంగనా ధరించి ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని పంపిన కాంచీపురం సిల్క్ చీరను ఉద్దేశించి కంగనా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.


పనికిమాలిన బాలీవుడ్ అవార్డుల కన్నా అద్భుతమైన ఈ చీర ఎంతో బెటర్ అంటూ ఇన్స్టాలో రాసుకోచ్చారు. దీంతో కంగనా బాలీవుడ్ అవార్డులను కించపరుస్తూ మాట్లాడుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కంగనా బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఉద్దేశించి ఇలా మాట్లాడడంతో బాలీవుడ్ పెద్దలు సీరియస్ అవుతున్నారు. ఈ విషయం పైన కంగనా ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం వెలుగులోకి రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: