తమిళ నటుడు విక్రమ్ తాజాగా వీర ధీర శూర అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మంచి అంచనాల నడుమ మార్చి 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా మంచి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. కానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకోవడానికి మాత్రం మరికొన్ని కలెక్షన్లను వసూలు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 8 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ ఇంకా ఎన్ని కలెక్షన్లను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు తమిళనాడు ఏరియాలో 29. 80 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.25 కోట్లు , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 3.20 కోట్లు , ఓవర్సీస్ లో 13.25 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 23.43 కోట్ల షేర్ కోట్ల షేర్ ... 48.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమా దాదాపు 36 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 12.55 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఇకపోతే ఈ మూవీ కి ఈ వీకెండ్ లో కనుక మంచి కలెక్షన్లు వచ్చినట్లయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని అవకాశాలు ఉంటాయి. ఈ వీకెండ్ లో ఈ మూవీ కి మంచి కలెక్షన్లు రాకపోతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకోవడానికి కష్ట పడాల్సిన అవసరం ఉండే ఛాన్స్ ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: