టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రోజురోజుకు ఎంతో మంది కొత్త దర్శకులు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉన్నారు. అందులో కొంతమంది దర్శకులు మొదటి సినిమాతోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా వారి హవాను కొనసాగిస్తారు. ఇక మరి కొంతమంది ఎన్నో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు అందుకోలేక పోతారు. ఉప్పెన సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే ఈ దర్శకుడు ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు.


సినిమా అనంతరం బుచ్చిబాబు రామ్ చరణ్ తో కలిసి తన తదుపరి సినిమాను తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. మొదట తెలుగులో దేవర సినిమాలో నటించిన ఈ చిన్నది తన నటనతో మంచి గుర్తింపు అందుకుంది. దేవర సినిమాలో జాన్వి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో ఈ చిన్నదాని నటన మరింత అద్భుతంగా ఉంటుందని అభిమానులు అంటున్నారు.

అయితే మొదట బుచ్చి బాబు రామ్ చరణ్ తో కాకుండా ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయాలని అనుకున్నారట. ఎన్టీఆర్ కూడా ఆ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతా ఓకే అనుకున్నాక వారిద్దరి కాంబినేషన్లో సినిమా బ్రేక్ అయింది. దీంతో రామ్ చరణ్ తో కలిసి బుచ్చిబాబు సినిమా చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ కోసం రెడీ చేసిన సినిమా కథను కాకుండా చరణ్ కోసం మరో సినిమా కథలో సిద్ధం చేసి సినిమాను తీస్తున్నారట.

ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసుకున్న కథను అలానే పక్కన పెట్టారట. రామ్ చరణ్ తో సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ తో కలిసి ఈ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక పెద్ది సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ లో ఉన్నారట. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: