ప్రియాంక చోప్రా ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రియాంక చోప్రా 1982 జూలై 18న జన్మించారు. ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ పోటీలలో విజేతగా నిలిచి కిరీటాన్ని కైవసం చేసుకుంది. 2003 సంవత్సరంలో సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకుంది. అనంతరం బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో కలిసి సినిమాలలో నటించింది. ఇదిలా ఉండగా ప్రియాంక చోప్రా అత్యధిక రెమ్యూనరేషన్ వసూలు చేసే హీరోయిన్ల జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.


 
ప్రియాంక చోప్రా కు ఫ్యాషన్ అంటే ఎంతగానో ఇష్టం. ఆమె వేసుకునే ప్రతి ఒక్క వస్తువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రియాంక చోప్రా వాడే వస్తువుల ఖరీదు కోట్ల విలువ చేసేవిగా ఉంటాయి. ఈ బ్యూటీ సినిమాలలో రాణిస్తున్న సమయంలోనే హాలీవుడ్ నటుడు పాప్ సింగర్ నిక్ జాసన్ ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ప్రియాంక హాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు, సినిమాలలో నటిస్తూ సక్సెస్ అయ్యింది. బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తుంది.

అంతేకాకుండా ఈ బ్యూటీ తెలుగులో కూడా సినిమాలు చేయడానికి సిద్ధమైంది. అది కూడా జక్కన్న సినిమాలో కావడం విశేషం. మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి 29 సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది. త్వరలోనే ప్రియాంక చోప్రా షూటింగ్ లో పాల్గొనబోతుందని అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.


సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందని అభిమానులు అంటున్నారు. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కనుక నటించినట్లయితే టాలీవుడ్ లో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో ప్రియాంక చోప్రా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సెటిల్ అయిపోతుందని ఆ కారణంగా టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లకు సినిమాలలో అవకాశాలు కాస్త తగ్గుముఖం పడతాయని నెటిజన్లు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: