టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒకప్పటి హీరోయిన్లు ఎంతో సాంప్రదాయంగా అందచందాలతో అద్భుతంగా నటించేవారు. ఇక నేటి కాలంలో పూర్తిగా ఎక్స్పోజింగ్ పాత్రలు చేసుకుంటూ నటిస్తున్న హీరోయిన్లు కొందరు ఉన్నారు. ఇక అలనాటి నటి అందాల తార టబూ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిన్నది తన నటన, అందచందాలతో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది.

మరి ముఖ్యంగా నాగార్జునతో కలిసి నిన్నే పెళ్లాడుతా సినిమాలో నటించి తన నటన, అందంతో ఎన్నో అవార్డులను అందుకుంది. ఈ సినిమాలో ఈ చిన్నదాని నటనకు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. తెలుగులోనే కాకుండా హిందీలోనూ అనేక సినిమాలలో నటించింది. ఈ చిన్నది వయసు పెరిగినప్పటికీ అదే అందం, ఫిట్నెస్ కొనసాగిస్తూ సినిమాలలో నటిస్తుండడం విశేషం. టబూ వయసు 53 సంవత్సరాలు.


ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. కానీ టబు సినిమాలలో నటిస్తున్న సమయంలో కొంతమంది హీరోలతో ప్రేమాయణాలు కొనసాగించిందని వారిని వివాహం చేసుకోవాలని అనుకున్నట్టుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. అయితే వారిలో టబూ ఎవరిని వివాహం చేసుకోలేదు. కానీ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ను ఈ బ్యూటీ విపరీతంగా ప్రేమించిందట.


ఆ హీరోను వివాహం చేసుకోవాలని అనుకుందట. ఇద్దరూ కలిసి పీకల్లోతో ప్రేమలో మునిగి తేలారట. ఇక ఏమైందో తెలియదు అజయ్ వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ బాధలో టబు ఇంతవరకు ఎవరిని వివాహం చేసుకోకుండా ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం టబుకి సంబంధించిన ఈ వార్త బాలీవుడ్ సర్కిల్స్ లో కోడై కూస్తోంది. ఈ వార్తలపై టబూ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: