సాధారణంగా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా చాలా తక్కువ.  బడా స్టార్స్ అయితే మరింత తక్కువ . ఎవరు ఇద్దరో ముగ్గురో మాత్రమే సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు . అయితే బాలయ్య కొన్ని విషయాలలో సెంటిమెంట్స్ బాగా నమ్ముతారు . మరి కొన్ని విషయాలలో నమ్మరు.  మరీ ముఖ్యంగా దేవుడిని బాగా నమ్మే బాలయ్య తన సొంత మనిషిలా భావించే ఫ్యామిలీ పూజారి చెప్పిన విషయాన్ని పక్కన పెట్టేసాడు . దానికి  తగ్గట్టే ఆయన టైం బ్యాడ్ గా మారిపోయింది అంటున్నారు జనాలు .

ప్రజెంట్ సోషల్ మీడియాలో బాలయ్య పేరు కన్నా ఆయన కొడుకు మోక్షజ్ఞ పేరు ఎక్కువగా ట్రెండ్ అవుతుంది.. ట్రోలింగ్కి గురవుతుంది . దానికి కారణం మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అంటూ ఎప్పటినుంచో ఫాన్స్ కోరుకుంటూ ఉండడమే. ఇదిగో ఎంట్రీ అదిగో ఎంట్రీ అంటూ ఇన్నాళ్లు ఆశలు పెట్టారు . ఫైనల్లీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి.  అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది . రేపో మాపో షూటింగ్ అంటూ కూడా మాట్లాడేశారు .



సీన్ కట్ చేస్తే మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతుంది . ఆ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్వీన్ డైరెక్షన్ లో ఎంట్రీ అన్నారు.  అది కూడా ఆగిపోయింది.  ఫైనల్లీ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది అన్నారు . అది కూడా క్యాన్సిల్ అంటూ టాక్ వినిపిస్తుంది.  ఇలా బ్యాక్ టు బ్యాక్ మోక్షజ్ఞ సినిమాలు కమిట్ అయినట్లే అయి మొత్తం క్యాన్సిల్ అయిపోతూ ఉండడంతో గతంలో వైరల్ అయిన ఓ న్యూస్ ని మరోసారి ట్రై చేస్తున్నారు జనాలు .



బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆచి చూచి నిర్ణయాలు తీసుకోవాలి అని 2027 వరకు మోక్షజ్ఞ జాతకం అస్సలు బాగోలేదు అని.. ఆ టైం వరకు ఆగితే బాలయ్య బాగుంటుంది అంటూ సొంత మనిషిలా భావించే పూజారి చెప్పారట . కానీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఉండడం మోక్షజ్ఞ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో బాలయ్య తొందరపడి మోక్షజ్ఞ ఎంట్రీని ఫిక్స్ చేసేసారు . అయితే జాతకాలు మాత్రం పెద్దగా కలిసి రాలేదు. అందుకే ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆయన సినిమా హోల్డ్ లో పడిపోతూనే వస్తుంది అంటున్నారు జనాలు . బాలయ్య ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు . మరి ఈ విషయంలో ఎందుకు ఇలా చేశాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: