
అయితే చిరంజీవి ఇప్పటికీ కూడా హీరోగానే సినిమాలు చేస్తూ ఉండడం గమనార్హం. అనిల్ రావిపూడి తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి తో ఒక సినిమాని చేయడానికి ఫిక్స్ అయి ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ చిరంజీవి సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి సినిమాలకు కమిట్ అయిపోతూ వెళ్లడంతో రామ్ చరణ్ చాలా ఎక్కువగా చిరంజీవి హెల్త్ గురించి ఆలోచిస్తున్నారట . చిరంజీవి సినిమాలు పట్ల ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడు అనేది అందరికీ తెలుసు . హెల్త్ బాగో లేకపోయినా సరే ఆ సినిమా షూట్ కంప్లీట్ చేయాలి అని మొండిగా ఉండే వాడు. అందుకే మెగాస్టార్ అయ్యాడు .
కానీ అది యంగ్ ఏజ్ లో.. ఇప్పుడు ఆయనకి ఏజ్ అయిపోతుంది . ఇలాంటి మూమెంట్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అవ్వడం కంటిన్యూగా కాల్ షీట్స్ ఫిక్స్ చేసుకోవడం కొంచెం కష్టమైన విషయమే . పైగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి . అయితే చిరంజీవికి మాత్రం రామ్ చరణ్ గట్టిగానే చెప్పేశారట . సినిమాలని ఆపేసి ప్రశాంతంగా లైఫ్ ను ఎంజాయ్ చేయాలి అని. కానీ చిరంజీవి మాత్రం అస్సలు ఒప్పుకోలేదట . నిజానికి "ఆచార్య" సినిమా నుంచి చిరంజీవి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అని మెగా ఫ్యామిలీ కోరుకుంటుంది . కానీ చిరంజీవి మాత్రం తనకి సినిమాలపై ఉన్న ప్యాషన్ తో ఇంకా ఇంకా సినిమాలను ఓకే చేస్తూ వస్తున్నాడట . అయితే చిరంజీవి ఈసారి చరణ్ మాటలను బాగా సీరియస్ గా తీసుకొని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. సినిమాల వల్ల హెల్త్ ప్రాబ్లం ఏమీ రాదు హెల్త్ జాగ్రత్తగానే ఉంటుంది .. నా సినిమాల విషయాలు నేను చూసుకుంటాను అంటూ కొంచెం కోపంగానే చిరంజీవి - చరణ్ కు తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చారట . ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . చరణ్ తండ్రి పట్ల చూపిన బాధ్యత చిరంజీవి సినిమాల పట్ల చూపుతున్న ప్రేమ రెండు కూడా న్యాయమే . న్యాయమైన ప్రేమలో ఎవరు గెలుస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది..!!!