
దక్షిణ భారత సినీ కార్మికుల సఖ్యతకు (పెప్సీ).. అధ్యక్షుడిగా రోజా భర్త ఉన్నారు. కానీ గత కొంతకాలంగా తమిళ నిర్మాతల మండలి పెప్సీ కి మధ్య వార్ నడుస్తూ ఉండడం జరుగుతోంది. దీంతో అందులో ఉండే సభ్యులు కూడా ఒకరి పైన మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ ఉంటున్నారట. ముఖ్యంగా నిర్మాతల నుంచి కార్మికుల వరకు అందే వేతనాల విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని ప్రభుత్వ సొమ్ముని సైతం చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారనే విధంగా.. రోజా భర్త సెల్వమణి పైన నిర్మాత సభ్యులు సైతం ఫైర్ అవుతూ ఉన్నారు.
అయితే ఈ విషయం పైన సెల్వమణి మాట్లాడుతూ కొంతమంది నిర్మాతలు కావాలని ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. హీరో ధనుష్ నిర్మాణ సంస్థ పైన వివాదం చేయడంతో ఈ వివాదం పైన సరైన రీతిలో స్పందించలేదంటూ కూడా సెల్వమణి పైన చాలామంది ఆరోపణలు కూడా చేయడం జరిగింది. మరి రోజా భర్త సెల్వమణి పైన వస్తున్న ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. తమిళ నిర్మాతలు ఈయనకు షాక్ ఇస్తే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. రోజా కూడా ఇటీవలే మళ్లీ తిరిగి బుల్లితెర పైన కనిపిస్తోంది.