
Sr.ఎన్టీఆర్:
రాముడు, కృష్ణుడు అనగానే తెలుగు వారికి ఎక్కువగా గుర్తుకు వచ్చేది దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే. రాముడు పేరు చెబితే కృష్ణుడు పేరు చెబితే మొదట ఈ హీరో పేరే వినిపిస్తుంది.అలా సీనియర్ ఎన్టీఆర్ లవకుశ, శ్రీరామ పట్టాభిషేకం వంటి సినిమాల్లో రాముడి పాత్రలో అలరించారు.
ఏఎన్ఆర్:
శ్రీ సీతారామ జననం మూవీలో అక్కినేని నాగేశ్వరరావు కూడా శ్రీరాముడి పాత్రలో నటించారు.
సుమన్:
సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మళ్లీ శ్రీరాముడి పాత్ర బాగా సెట్ అయింది సుమన్ కి మాత్రమే. ఈ హీరో శ్రీరామచంద్రుడి పాత్రలో చాలా అద్భుతంగా కనిపిస్తారు. అలా నాగార్జున హీరోగా నటించిన శ్రీరామదాసు సినిమాలో సుమన్ శ్రీరాముడి పాత్రలో నటించారు.
శోభన్ బాబు:
టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబుకి కూడా రాముడి గెటప్ చాలా బాగా సెట్ అవుతుంది. ఈయన సంపూర్ణ రామాయణం సినిమాలో ఆ రాముల వారి పాత్రలో అద్భుతంగా నటించారు.
జూనియర్ ఎన్టీఆర్:
గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన బాల రామాయణం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలోనే రాముడిగా నటించారు.అలా ఎన్టీఆర్ బాల రామాయణం మూవీతో బాల నటుడిగా రాముడి పాత్రలో అద్భుతంగా చేశారు.
బాలకృష్ణ:
బాపు డైరెక్షన్లో వచ్చిన శ్రీరామరాజ్యం మూవీలో నందమూరి బాలకృష్ణ ఆ శ్రీరాముడి పాత్రలో నటించి మెప్పించారు.
ప్రభాస్:
ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ మూవీ లో ప్రభాస్ శ్రీరాముని పాత్రలో చేశారు. కానీ ఈ సినిమా ద్వారా ప్రభాస్ విమర్శల పాలైన సంగతి మనకు తెలిసిందే. ఎందుకంటే ఈ మూవీలో ప్రభాస్ మీసాలు పెట్టుకోవడంతో మీసాల రాముడు అంటూ ట్రోలింగ్ కి గురయ్యాడు.
శ్రీకాంత్:
కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన దేవుళ్ళు మూవీలో నటుడు శ్రీకాంత్ శ్రీరాముడి పాత్రలో నటించారు