- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజా గా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది .. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఎంతో శ‌ర‌వెగంగా జరుగుతుంది .. అలాగే ఈ సినిమా ను దర్శకుడు బుచ్చిబాబు ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కిస్తున్నాడు . అలాగే ఈ సినిమా పై మెగా అభిమానుల తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి . అలాగే ఈ సినిమా లో రామ్ చరణ్ పాత్ర కూడా ఎవరు ఊహించని విధంగా ఉండబోతుంద ని ఇప్పటికే చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తుంది .. ఇదే క్రమంలో ఈ సినిమా లో వింటేజ్ రామ్ చరణ్ కనిపించబోతున్నార ని కూడా చెబుతున్నారు .. ఇక ఈ సినిమా లో రామ్ చరణ్ పాత్ర గతం లో ఆయన నటించిన మగధీర , రచ్చ , రంగస్థలం సినిమాల లో తనదైన స్వాగ్, కామెడీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ..


ఇక ఇప్పుడు పెద్ది సినిమా లో కూడా మరోసారి మనకు ఆ వింటేజ్ రామ్ చరణ్ కనిపిస్తాడ ని కూడా తెలుస్తుంది .. ఇక పెద్ది లో రామ్ చరణ్ పాత్ర అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వడం ఖాయమ ని కూడా సినిమా యూనిట్ వర్గాలు చెబుతున్నాయి .. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ డేట్ గ్లింప్స్ వీడియోని   ఏప్రిల్ 6 అనగా ఈరోజు శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు .. ఇక జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు .. వృద్ధి సినిమాస్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు .. ఇక మరి ఈ సినిమా లో అయ‌న  రామ్ చరణ్  సరైన సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: