
ఇక సమంత నాని కాంబోలో రెండు సినిమాలు వచ్చి మంచి విజయాలు సాధించిన విషయం తెలిసిందే .. అయితే వాటిలో నాని సూపర్ హిట్ సినిమాల్లో ఒకటేనా నిన్ను కోరి మూవీకి మొదటగా దర్శకుడు సమంతను సంప్రదించగ ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో సినిమాను వదులుకుంది .. అలాగే అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సినిమా పుష్ప ఈ సినిమాలో కూడా రష్మిక మందన్న స్థానంలో మొదటగా సుకుమార్ సమంతను తీసుకోవాలని భావించారట కానీ అప్పుడే సమంత విడకులు తీసుకోవడంతో ఈ సినిమా చేయడానికి నో చెప్పడంతో రష్మికకు ఛాన్స్ వచ్చింది .
అలాగే శంకర్ , విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఐ ఈ సినిమాలో కూడా హీరోయిన్గా అమీ జాక్సన్ నటించిన .. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా సమంతను అనుకున్నారు కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల సమంత ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది .. అలాగే రామ్ చరణ్ , అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సినిమా ఎవడు అయితే ఈ సినిమాల్లో ముందుగా సమంతను హీరోయిన్గా అనుకున్నారట .. కానీ సమంత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుందని ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట . అలాగే బాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ .. ఈ సినిమా కోసం కూడా ముందుగా సమంతను అనుకున్నారట .. కానీ దీనికి కూడా ఈమె అంతగా ఇంట్రెస్ట్ చూపించలేద . ఇలా సమంత తన కెరీర్ లో పలు సూపర్ హిట్ సినిమాలను చేతులారా వదులుకుంది .