దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో సినిమాల కోసం ఎంతోమంది సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలు కూడా అప్పట్లో పోటీపడేవారు. అయితే ఇప్పుడు ఆయన ఎక్కువగా దర్శకత్వం వహించట్లేదు కానీ కొన్ని సినిమాలను అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈయన శిష్యులుగా వచ్చిన ఎంతోమంది ఇండస్ట్రీని ఏలుతున్నారు. అలాంటి వారిలో రాజమౌళి ఒకరు. రాజమౌళి రాఘవేంద్రరావు శిష్యుడే.. రాఘవేంద్ర రావు దగ్గర శిక్షణ తీసుకొని ప్రస్తుతం పాన్ ఇండియా దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి రాఘవేంద్రరావుకి  ఈ స్టార్ట్డం వచ్చింది ఆ హీరో వల్లనేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు నేను ఈ స్థాయిలో ఉండడానికి ఆ హీరోనే కారణం అంటూ రాఘవేంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతకీ రాఘవేంద్రరావుకి స్టార్డం తెచ్చిన ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.

రాఘవేంద్రరావుకు స్టార్డం ని తెచ్చిన హీరోలు అనగానే అందరికీ చిరంజీవి,నాగార్జున, బాలకృష్ణ,వెంకటేష్ వంటి హీరోలు గుర్తుకొస్తారు.కానీ ఈ తరం హీరోలు కాదు వీళ్ళ కంటే ముందు తరం హీరోల వల్లే ఈయనకు ఆ గుర్తింపు వచ్చింది. ఇక రాఘవేంద్రరావుకి ఆ స్థాయిలో గుర్తింపు రావడానికి ప్రధాన కారణం సీనియర్ ఎన్టీఆర్. ఈ విషయాన్ని స్వయంగా రాఘవేంద్రరావు తాజాగా ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో కథా సుధ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ కథా సుధ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్స్లో రాఘవేంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నాకు సీనియర్ ఎన్టీఆర్ వల్లే ఇంత మంచి స్టార్డం లభించింది. 
నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం నందమూరి తారక రామారావు గారే. ఆయన వల్లే నాకు ఇప్పుడు ఈ స్థాయి ఉంది. ఆయన హీరోగా నటించిన అడవి రాముడు సినిమా నన్ను ఇండస్ట్రీలో నిలబెట్టింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాలు చేశాను. కానీ అడవి రాముడు సినిమా మాత్రమే ప్రత్యేకం. ఈ సినిమా 100 రోజుల షీల్డ్ ఇప్పటికీ నా ఇంట్లో భద్రంగా ఉంది. ఆయనతో ఎన్నో సినిమాలు తెరకెక్కించాను. కానీ ప్రతి సినిమా సమయంలో నేను ఆయన నటన చూసి ఆశ్చర్యపోయేవాడిని..అంటూ రాఘవేంద్రరావు సీనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అలాగే తన శిష్యుడైన రాజమౌళి పాన్ ఇండియా రేంజ్ లో పేరు తెచ్చుకోవడం తనకేంతో గర్వకారణం అంటూ కూడా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: