
మరి కొంతమంది ఇది ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఫోటోలు లాగా కనిపిస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే కీర్తి సురేష్ ఈ ఫోటోలలో చాలా బొద్దుగా కనిపిస్తోంది. మరి కొంతమంది మాత్రం సమ్మర్ మొదలైన వెంటనే కీర్తి సురేష్ ఇలా హెయిర్ స్టైల్ మార్చేసిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలను బాయ్ కాట్ చేయాలంటూ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు.తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని వివాహం చేసుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం వివాహ బంధాన్ని బాగా ఎంజాయ్ చేస్తోంది.
వివాహమనంతరం ఏ చిత్రాలలో కూడా కమిట్ అవ్వకుండా కీర్తి సురేష్ వైవాహిక బంధాన్ని ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకున్నది. కానీ సౌత్ చిత్రాలు తగ్గించి మరి బాలీవుడ్ లో తన హవా చూపించడానికి ప్రయత్నాలు చేస్తోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. పలు రకాల లేడీ ఓరియంటెడ్ చిత్రాలలోనే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్న కీర్తి సురేష్ ఇందులో బోల్డు పాత్రలో కూడా నటిస్తోంది. ఇటీవల అక్క అనే ఒక వెబ్ సిరీస్ లో నటించిన కీర్తి సురేష్ త్వరలోనే నెట్ ఫ్లిక్ ఓటీటి లో కూడా రాబోతున్నది. మొత్తానికి కీర్తి సురేష్ తాజా లుక్ లో మాత్రం కనిపిస్తున్న ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.