
అలాగే ఎన్టీఆర్ ఎంతో గొప్పవాడు ఆశాధారణ ప్రతిభవంతుడు ఒక అద్భుతమైన టీం మేము కలిసి వార్ 2 చేశాము.. అందరూ ఆగస్టు 14 కోసం వేచి చూడండి అంటూ హృతిక్ చెప్పుకొచ్చాడు .. ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులకు అలాగే ఈ కాంబినేషన్ పై అంచనాలు కూడా భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి .. ఇక వార్ 2 సినిమాని బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ , తెరకెక్కిస్తున్నాడు .. అలాగే ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తీసుకువస్తున్నారు .. అలాగే ఈ స్టైలిష్ యాక్షన్ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది కేవలం ఒక పాట మినహ మిగాలిన సన్నివేశాల షూటింగ్ పూర్తయింది . ఇక ఈ పాటలో హృతిక్ మరియు ఎన్టీఆర్ కలిసి స్టెప్పులైబోతున్నారు ..
ఇదే క్రమంలో ఈ షూటింగ్ సమయంలో హృతిక్ గాయపడటం తో ఈ షెడ్యూల్ కొంత ఆలస్యమై త్వరలోనే ఈ పాట షూటింగ్ పూర్తి చేసి 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు .. ఇక హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ ను పొగటం వెనుక ఈ ఇద్దరి మధ్య సెట్స్ పై అద్భుతమైన కెమిస్ట్రీ ఉందని మరోసారి అర్థమైంది. ఎన్టీఆర్ తన నటన ప్రతిభతో టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఇప్పుడు తన సత్తా చూపించాడు. ఇక వార్ 2 లో ఈ ఇద్దరు సూపర్ స్టార్లపై హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు .. ఇక ఈ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు .