
మరికొద్ది రోజుల రాబోతున్న అల్లు అర్జున్ పుట్టినరోజు కోసం అతని అభిమానులు ఎంతో ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు .. ఎందుకంటే ఆ రోజున బన్నీ కొత్త సినిమా అనౌన్స్మెంట్ రాబోతుంది .. పుష్ప 2 లాంటి పాన్ ఇండియా విజయం తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా కాబట్టి .. అయితే అదే రోజు అల్లు అర్జున్ తో పాటు మరో హీరో కూడా తన కొత్త సినిమా ను ప్రకటించబోతున్నాడు .. అతనే అక్కినేని హీరో అఖిల్ . గత కొన్ని సంవత్సరాలు గా లైమ్ లైట్ కు దూరం గా ఉన్నాడు అఖిల్ .. ఏజెంట్ ప్లాఫ్ అతని బాగా కుంగదీసింది .. ఈ సినిమా పై చాలా అంటే చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్ , అది ప్లాప్ అవడం తో తట్టుకోలేకపోయాడు .. అందుకే ఇప్పటి వరకు మరో సినిమా ను ఎక్కడా ప్రకటించలేదు ..
ఇప్పుడు ఎట్టకేల కు ఆ బాధ నుంచి బయటపడి ఇప్పుడు తన కొత్త సినిమా చేయబోతున్నాడు . వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం లో అఖిల్ సినిమా చేయబోతున్నాడు .. ఇక ఈ సినిమా ప్రకటన ను ఓ వీడియో రూపం లో 8 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు .. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా తో మొదటిసారి అన్నపూర్ణ స్టూడియోస్ - సితార ఎంటర్టైన్మెంట్స్ చేతులు కలుపుతున్నాయి .. ఓ రూరల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు 8 వ తారీఖున బయటకు వస్తాయ ని కూడా అంటున్నారు . ఇక మరి ఈ సినిమా తో అయినా అఖిల్ సక్సెస్ సాధిస్తాడా లేదో చూడాలి ..