
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసింది .. ఇక ఈ సినిమా ను దర్శకుడు సుకుమార్ పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు .. ఇక దీంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రికార్డుల వర్షం కొల్లగొట్టింది .. అలాగే ఈ సినిమాకు సిక్వల్ కూడా రాబోతుందంటూ మేకర్స్ ఇప్పటికే ప్రకటించడం తో ఈ మూవీ ఎప్పుడు ఎప్పుడు పట్టాలెత్తుందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. కాగ ఈ సినిమాకు సంబంధించిన రోజుకో వార్త సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతున్నే ఉంది .. తాజాగా ఈ సినిమా కు సంబంధించిన విలన్ పాత్ర పై సరికొత్త బజ్ క్రియేట్ అయింది ..
సుకుమార్ ఈ సినిమా కథను మరింత పవర్ఫుల్ గా రెడీ చేసుకున్నట్టు తెలుస్తుంది .. అలాగే దీనికోసం ఈ సినిమాలో ఇద్దరు విలన్లను పెట్టాలని కూడా ఆయన చూస్తున్నాడట .. ఇక దీనికోసం విజయ్ దేవరకొండ , నాని పేర్లను ఆయన పరిశీలిస్తున్నాడట .. ఇప్పటికే విజయ్ దేవరకొండ ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్నాడని వార్త వైరల్ గా మారింది . ఇక ఇప్పుడు నాని కూడా యాడ్ కావడం తో నిజంగానే సుకుమార్ ఇలాంటి ప్లాన్ ఏమైనా చేస్తున్నాడ ని అభిమానులు ఎంతో ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు .. ఇక పుష్ప 3 రాంపేజ్ లో అల్లు అర్జున్ పాత్ర ఇప్పటి వరకు వచ్చిన పుష్ప , పుష్పా 2 సినిమాలకు మించి ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట . కానీ ఈ ప్రాజెక్ట్ మొదలయ్యేందుకు ఇంకా చాలా సమయం ఉందని కూడా తెలుస్తుంది . ఇక మరి నిజం గానే పుష్పా 3 లో విజయ్ దేవరకొండ , నాని విలన్ గా నటిస్తారనేది మాత్రమే క్లారిటీ లేదు ...