తమన్నా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అవుతుంది. నటిగా తమన్నా ఎన్నో రకాల పాత్రలు పోషించింది. గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ పొట్టి డ్రెస్సులు మాత్రమే కాదు చీర కడితే అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉంటుంది. అయితే అలాంటి ఈ హీరోయిన్ ఈ మధ్యనే బ్రేకప్ వార్తలతో సోషల్ మీడియాలో ట్రెండ్ టాపిక్ అయిన సంగతి మనకు తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్న విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్ చేసుకుంది అనే వార్తల వల్ల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే అలాంటి ఈ బ్యూటీ బర్త్ డే రోజు తమిళంలో అలాంటి వార్తలు విని కన్నీళ్లు పెట్టుకున్నాను అంటూ తాజా ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది మరి ఇంతకీ తమన్నా ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.. 

సంపత్ నంది టీం వర్క్ లో మధు క్రియేషన్స్ బ్యానర్ పై మధు నిర్మిస్తున్న ఓదెల-2 మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఓదెల మూవీలో హెబ్బా పటేల్ కీరోల్ పోషించింది. ఇక ఓదెల -2 మూవీలో తమన్నా లేడీ సన్యాసి పాత్రలో నటిస్తోంది.ఇక ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదలకు సిద్ధంగా ఉండడంతో సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్.అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ..నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అవుతున్నా నాకు వరుస అవకాశాలు రావడం ఎంతో ఆనందంగా ఉంది.నేను సినిమాల్లోకి వచ్చిన టైంలో ఇన్ని రోజులు ఇండస్ట్రీలో కొనసాగుతానని ఊహించలేదు. ఇక నా 21 బర్త్డే రోజు నేను సినిమా షూటింగ్స్ పక్కన పెట్టి ఇంట్లోనే ఫ్యామిలీతో గడిపాను. ఆ టైంలో పేపర్లో వచ్చిన ఒక వార్త చూసి నేను షాక్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాను.

అదేంటంటే తమిళ నెంబర్ 1 నటి తమన్నా అంటూ హెడ్ లైన్ తో నా గురించి పేపర్లో అద్భుతంగా రాశారు. నా బర్త్ డే రోజు నా గురించి ప్రత్యేకంగా రాసిన ఈ కథనం చదివిన తర్వాత నాకు కన్నీళ్లు వచ్చాయి. ఇంత బాగా ఇండస్ట్రీ నన్ను ఆదరిస్తుందని అనుకోలేదు. వారి ప్రేమాభిమానాలకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలు గానే ఉంటాను.నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్ళాక ఆ పొజిషన్లో ఎక్కువ రోజులు కొనసాగడం సులువు కాదనిపించి దాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో వైవిద్య భరితమైన సినిమాల్లో నటించాను. అలా ఇప్పటికే విభిన్న భాషల్లో నటించడంతోపాటు వైవిధ్య భరితమైన పాత్రలు పోషించాను అంటూ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: