సినీ ఇండస్ట్రీలో ఉన్నామంటే  ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం కలిగి ఉంటేనే లైఫ్ బాగుంటుంది. కానీ కొంతమంది హీరో, హీరోయిన్లు మాత్రం కాస్త స్టార్డం రాగానే మా అంత ఎవరూ లేరు అన్నట్టుగా ఫీల్ అవుతూ, వారు ఏ విధంగా ఎదిగారు అనే విషయాన్ని మర్చిపోతారు. ప్రస్తుతం అదే కోవలోకి వచ్చింది నేషనల్ క్రష్ రష్మిక మందాన. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటిసారి ఏ హీరోతో ఏ సినిమాలో చేసిందో ఆ విషయాన్ని చెప్పడానికి చాలావరకు సందేహించింది. మరి ఆమె ఏ సినిమాలో చేసింది వివరాలు చూద్దాం.. రష్మిక మందాన  సినిమాలో ఎంతో ఫేమస్ అయింది. ఈ మధ్యకాలంలో మాత్రం వివాదాల బాట పడుతుంది. దీంతో కన్నడిగులు ఆమెపై తీవ్రంగా మండిపడుతున్నారు. 

అయితే ఒక సందర్భంలో ఆమె కాంతారా సినిమాని అసలు చూడలేదని చెప్పింది. అయితే సినిమా రిలీజ్ అయిన రెండవ రోజే నన్ను సినిమా చూశారా అని ఎవరో ప్రశ్న అడిగారు. ఆ టైంలో నేను బిజీ షెడ్యూల్ లో ఉండడం వల్ల సినిమా చూడలేదు దీంతో నేను మొత్తమే సినిమా చూడలేదని కొంత మంది అపార్థం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమా చూసి బాగుందని రిషబ్ శేట్టికి మెసేజ్ పెట్టాను అని చెప్పింది. ఈ సినిమా విషయం పక్కనపెడితే ఒక ఇంటర్వ్యూలో ఆమె  తాను నటించిన మొదటి సినిమా కిర్రిక్ పార్టీ పేరును చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు.

ఇదే కాదు తను తెలుగులో మొదటి సినిమా చలో చిత్రం గురించి కూడా చెప్పుకోవడం అసలు ఇష్టం లేదట. ఈ విధంగా రష్మిక కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా తాను చేసిన మొదటి సినిమాల గురించి చెప్పుకోకపోవడం వల్ల ఆ సినిమాల్లో చేసిన హీరోలను అవమానించినట్టు కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు చలో సినిమా సమయంలో కూడా రష్మిక మందన చాలా పొగరుగా మాట్లాడిందని నాగశౌర్య ఒక సందర్భంలో చెప్పారట. ఇక ఈ విషయం తెలుసుకున్న నేటిజన్స్ రష్మికపై తీవ్రంగా మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: