టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... జగపతి బాబు ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

లేకపోతే ఈ సినిమా విడుదల విషయంలో ఓ సక్సెస్ ఫార్ములాను ఫాలో అయ్యే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... రామ్ చరణ్ నటించిన సినిమాలలో అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్న మూవీలలో రంగస్థలం మూవీ ఒకటి. ఈ సినిమా చరణ్ కెరియర్లోనే అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న మూవీల లిస్టులో చేరిపోయింది. ఇకపోతే ఈ సినిమా 2018 వ సంవత్సరం మార్చి నెల విడుదల అయ్యి సూపర్ సక్సెస్ను అందుకుంది.

ఇకపోతే పెద్ది సినిమా విడుదల విషయంలో కూడా రంగస్థలం సినిమా ఫార్ములాను ఫాలో కావాలి అనే మేకర్స్ ఆలోచిస్తున్నట్లు , అందులో భాగంగా పెద్ద మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి నెలలో విడుదల చేయాలి అని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం పెద్ది మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షాట్ వీడియోలను ఈ రోజు అనగా ఏప్రిల్ 6 వ తేదీన శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది. మరి ఈ మూవీలోని ఫస్ట్ షాట్ వీడియో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: