ఈ మధ్య కాలంలో ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాషలో రీమేక్ చేసిన పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. ఇక తెలుగులో మంచి విజయాలు సాధించిన కొన్ని సినిమాలను హిందీలో రీమిక్ చేసిన సందర్భాలలో కూడా అలాంటి ఫలితాలే ఎక్కువ శాతం వచ్చాయి. మరి తెలుగులో విజయాలను సాధించిన సినిమాలను ఆ మూవీ దర్శకులే హిందీ లో రీమిక్ చేసిన సందర్భాలలో భారీ అపజయాలను అందుకున్న సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో శైలిష్ కొలను ఒకరు. ఈయన విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన హిట్ ది ఫస్ట్ కేస్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇదే సినిమాను ఈయన హిందీ లో హిట్ ది ఫస్ట్ కేస్ అనే టైటిల్ తోనే రీమిక్ చేశాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది.

తెలుగు సినీ పరిశ్రమలో మంచి  క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో గౌతమ్ తిన్ననూరి ఒకరు. ఈయన కొంత కాలం క్రితం నాని హీరోగా జెర్సీ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇదే సినిమాను ఇదే టైటిల్ తో హిందీ లో రీమేక్ చేశాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను అలరించడంలో మాత్రం విఫలం అయింది. ఇలా ఈ ఇద్దరు దర్శకులు తెలుగులో మంచి విజయాలను సాధించిన సినిమాలను హిందీలో రీమిక్ చేయగా ఆ మూవీ లతో హిందీ బాక్సా ఫీస్ దగ్గర మాత్రం అపజయాలను ఎదుర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: