టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం తారక్ "వార్ 2" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. అలాగే ఈ సినిమాతో పాటు తారక్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు.

ఇకపోతే తారక్ బావమరిది నార్నీ నితిన్ తాజాగా మ్యాడ్ స్క్వేర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దానితో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. చాలా కాలం తర్వాత తారక్ ఈవెంట్ కు రావడంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఈవెంట్ కు హాజరు అయ్యారు. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ లో తారక్ తన స్పీచ్ తో తన అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే మరోసారి మరో ఈవెంట్ కు తారక్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తారక్ సోదరుడు అయినటువంటి కళ్యాణ్ రామ్ తాజాగా అర్జున్ S/O వైజయంతి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ ను మరికొన్ని రోజుల్లో మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు , దానికి తారక్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా తారక్ మరికొన్ని రోజుల్లోనే మరో ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రానున్నట్లు వార్తలు వస్తుండడంతో ప్రస్తుతం ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: