- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆంధ్రలోని ఏలూరు స‌మీపంలోని కొవ్వ‌లిలో పుట్టి పెరిగిన నటి సిల్క్ స్మిత. ఈమె అసలు పేరు వడ్ల‌పట్టి విజయలక్ష్మి. సినిమా ఆమెకు సిల్క్ స్మిత అనే గుర్తింపును ఇచ్చింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాష‌ల‌లో 450కు పైగా సినిమాల‌లో న‌టించిన ఆమె అప్ప‌టి ప్రేక్ష‌కుల‌ను త‌న మ‌త్తెక్కించే కైపులు, క‌ళ్ల‌తో ఓ ఊపు ఊపేసింది. సిల్క్ స్మితకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేయ‌గా అత్తింటి వేధింపులు, భ‌ర్త వేధింపులు త‌ట్టుకోలేక వాళ్ల‌ను వ‌దిలి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.


ఆ త‌ర్వాత సినిమాల మీద ఆస‌క్తితో చెన్నై వెళ్లి నటి అపర్ణకు టచ్ అప్ ఆర్టిస్ట్ గా తన సినిమా జీవితాన్ని ప్రారంభించిన సిల్క్ స్మితకు 'ఇనయే తేడి' అనే మలయాళ చిత్రం సినిమా అవకాశాన్ని ఇచ్చింది. మలయాళ దర్శకుడు ఆంటోనీ ఈస్ట్‌మన్ ఆమెకు స్మిత అని పేరు పెట్టారు. వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఆమె తిరుగులేని హీరోయిన్, ఐటెం గ‌ర్ల్‌గా దూసుకుపోయింది. అటు సినిమాల్లో హీరోయిన్గాను... ఐటెం గ‌ర్ల్‌గాను, వ్యాంపు రోల్స్, ఇంకోవైపు ఐటెమ్‌ సాంగ్స్ తో సౌత్‌లో నాలుగు సినిమా ఇండ‌స్ట్రీల‌ను ఓ ఊపు ఊపేసింది సిల్క్ స్మిత.  


ఆ రోజుల్లోనే సిల్క్ ఒక్క ఐటమ్ డ్యాన్స్ చేయడానికి 50 వేల వరకు పారితోషికం తీసుకునేదట. ఇది ఇప్పటి కాలంలో 5 కోట్లకు సమానమని చెబుతారు. అంటే హీరోయిన్ కంటే 10-5 నిమిషాల పాటకి ఎక్కువ పారితోషికం తీసుకునేది. ఇప్పటి లెక్క ప్రకారం సమంత, రష్మికలు కూడా ఆమె ముందు నిలబడరని చెప్పాలి. సినిమా అవకాశాలు తగ్గినప్పుడు సినిమా నిర్మాణం చేయడం ప్రారంభించారు. అప్పుడు ఆమెకు 2 కోట్ల వరకు నష్టం వచ్చి మద్యపానానికి బానిస అయ్యారు. చివ‌ర‌కు అప్పుల బాధ‌తో 35 ఏళ్ల వ‌య‌స్సులోనే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: