మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అదిరిపోయే జోష్లో సినిమాలను ఓకే చేస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ సంవత్సరం జూన్ లేదా జూలై నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఓ వైపు జరుగుతూ ఉండగానే చిరు వరస పెట్టి అనేక సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.

ఇప్పటికే చిరంజీవి , అనిల్ రావిపూడి మరియు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలకు కమిట్ అయ్యాడు. కొన్ని రోజుల క్రితం చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబో మూవీ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక చిరంజీవి , శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన చాలా రోజుల క్రితమే వచ్చింది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకాస్త సమయం పట్టి అవకాశాలు కనబడుతున్నాయి.

ఇలా ఇప్పటికే ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటూ మరో రెండు మూవీలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి మరో బ్యానర్లో కూడా సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. KVN ప్రొడక్షన్స్ బ్యానర్లో చిరంజీవిమూవీ కి కమిట్ అయినట్లు ఆ మూవీ కి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ నిజం గానే చిరు , లోకేష్ కాంబోలో సినిమా కనుక సెట్ అయినట్లయితే ఆ మూవీ పై అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: