
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఎత్తుకు ఎదుగుతాడని తారక్ రెండు మూడు పేజీల డైలాగ్ లను సైతం అనర్ఘళంగా చెప్పగలడని ఆయన కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న టాలెంట్ మామూలు టాలెంట్ కాదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఏ భాషలో అయినా అలవోకగా మాట్లాడారని ఆయన కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా ఎత్తుకు ఎదుగుతాడని అదే నేను అనుకుంటానని అతనిలో ఆ లక్షణాలు ఉన్నాయని దగ్గుబాటి పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు దేవుని అనుగ్రహం కూడా ఉందని ఆయన కామెంట్లు చేశారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.
జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ ఏడాది వార్2 సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. వార్2 సినిమాకు పోటీగా కూలీ థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. లుక్స్ విషయంలో సైతం తారక్ ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ వచ్చే ఏడాది విడుదల కానుందని సమాచారం అందుతోంది.