బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో సల్మాన్ ఖాన్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో మూవీలలో నటించి అందులో ఎన్నో సినిమాలతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇలా ఎన్నో విజయాలను అందుకొని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ ఈ మధ్య కాలంలో మాత్రం అద్భుతమైన విజయాన్ని అందుకోలేదు. వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సల్మాన్ ఖాన్ కి భారీ విజయం మాత్రం దక్కడం లేదు. భారీ విజయ విషం పక్కన పెడితే ఈయన నటించిన చాలా సినిమాలు 100 కోట్ల కలెక్షన్ల మార్క్ ను మాత్రం అందుకున్నాయి. ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ నటించిన 18 సినిమాలు 100 కోట్ల మార్క్ ను అందుకున్నాయి. మరి సల్మాన్ ఖాన్ నటించిన ఏ సినిమాలు 100 కోట్ల కలెక్షన్ల మార్క్ ను టచ్ చేశాయి అనే వివరాలను తెలుసుకుందాం.

సల్మాన్ ఖాన్ మొదటి సారి దబంగ్ మూవీ తో 100 కోట్ల కలెక్షన్లను అందుకున్నాడు. ఆ తర్వాత రెడీ , బాడీగార్డ్ , ఏక్ థా టైగర్ ,  దబంగ్ 2 ,  జై హో , కిక్ , భజరంగీ భాయిజాన్ , ప్రేమ్ రతన్ ధన్ పాయో , సుల్తాన్ , ట్యూబ్ లైట్ , టైగర్ జిందా హై , రేస్ 3 ,  భారత్ ,  దబంగ్ 3 ,  కిసీ కా భాయ్ కిసి కి జాన్ , టైగర్ 3 సినిమాలు 100 కోట్ల కలెక్షన్లను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా సల్మాన్ ఖాన్ "సికిందర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... ఏ ఆర్ మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: