
ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్న వారందరూ కూడా తాత పేర్లు నాన్న పేర్లు చెప్పుకొని వచ్చినా అంతో ఇంతో టాలెంట్ ఉన్నవాళ్లే . ఆ విషయం మర్చిపోకూడదు . అయితే ఈ జనరేషన్ హీరోలు కొడుకులు ఫ్యూచర్లో ఇండస్ట్రీ లోకి రావాలి అంటూ కోరుకుంటున్నారు సొంత అభిమానులు . కానీ ఒక హీరో ఫ్యాన్స్ మాత్రం ఆ హీరో కొడుకు అసలు హీరో గానే సెట్ అవ్వలేడు అంటూ ముఖాన్నే చెప్పేస్తున్నాడు. ఆ హీరో మరెవరో కాదు మహేష్ బాబు . సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ మహేష్ బాబు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . ఇప్పుడు స్టార్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు.
అయితే మహేష్ బాబు కొడుకు మాత్రం గౌతం ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన చేయడం లేదు. అసలు ఆయన చాలా చాలా సైలెంట్ మీడియాతో మాట్లాడడు. ఎక్కడా కూడా పెద్దగా కనిపించడు. తన వర్క్ తాను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి గౌతమ్ కి సినీ ఫీల్డ్ సెట్ అవ్వదు. బాగా టాకిటివ్ గా ఉండాలి . కమ్యూనికేట్ అవ్వాలి. హీరోయిన్స్ తో జోవియల్ గా ఉండాలి . అలా ఉంటేనే హీరోగా ఎదగగలడు . ఇందులో ఏ ఒక్క క్వాలిటీ గౌతమ్ లో లేదు. మరి ఆయన ఇండస్ట్రీలోకి హీరోగా ఎలా రాగలడు..? అసలు ఆయన సెట్ అవ్వడు అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ నే ఓపెన్ గా ఒప్పేసుకుంటున్నారు.