టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా , నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఆఖరుగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందిన బింబిసారా అనే సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈయన అమిగొస్ , డెవిల్ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ రెండు సినిమాలు కూడా కళ్యాణ్ రామ్ కి నిరాశనే మిగిల్చాయి. ఇకపోతే తాజాగా కళ్యాణ్ రామ్ అర్జున్ S/O వైజయంతి అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ లో కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో విజయశాంతి నటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేశారు. అవి అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం కూడా వరుస పెట్టి ప్రమోషన్లను నిర్వహిస్తూ వస్తుంది.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను మైత్రి మూవీ వారు సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ ని నైజాం ఏరియాలో పెద్ద ఎత్తున విడుదల చేయడానికి మైత్రి సంస్థ వారు ఇప్పటి నుండే ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

nkr