సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని జూనియర్ సమంతగా పేరుపొందిన ఆషు రెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు యాంకర్ గా నటిగా పలు షోలలో హోస్టుగా చేస్తూ భారీగానే పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆషు రెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ తాను ఇండస్ట్రీలో బావ అని పిలిచే ఏకైక వ్యక్తి ఉన్నారని తెలియజేసింది. మరి ఆ నటుడు ఎవరో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


ఆషు రెడ్డి మాట్లాడుతూ తన జీవితంలో మొత్తం మీద బావ అని పిలిచేది యాంకర్ సుదీర్ ని మాత్రమేనని.. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఫ్యామిలీ స్టార్స్ షోలో బావా మరదలు కాన్సెప్ట్ తోనే నడుస్తూ ఉన్నదని తెలియజేసింది. తన రిలేటివ్స్ లో చాలామంది ఉన్నప్పటికీ కూడా వారిని పేర్లతో పెట్టి పిలుస్తూ ఉంటానని.. సుధీర్ నిజంగానే మరదళ్ల లాగా ఆటపట్టిస్తూ ఉంటారు. సుడిగాలి సుధీర్ టీవీ వర్సెస్ కాదు అతని హీరో పర్సనాలిటీ..ముఖ్యంగా అతని డ్యాన్స్, ఎమోషన్స్ అన్నీ కూడా హీరో లెవెల్స్ లోనే ఉంటాయి అంటూ తెలియజేసింది.


సుధీర్ స్టేజ్ మీద ఎలా ఉన్నప్పటికీ స్టేజ్ దిగాక సెట్ లో ఉన్న వారందరితో కలిసి పోతారని తెలియజేస్తోంది
ఆషు రెడ్డి. సుధీర్  అభిమానుల సైతం ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో మరింత వైరల్ గా చేస్తున్నారు. సుధీర్ మొదట కమెడియన్ గా ఆ తర్వాత యాంకర్ గా హీరోగా కూడా బాగానే ఫేమ్ సంపాదించినప్పటికీ ఈమధ్య కాలంలో సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు అందుకే తిరిగి మళ్ళీ బుల్లితెరపైనే ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా ఎదిగి ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించారు. ఇక సుడిగాలి సుదీర్ వివాహం గురించి అటు అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి గుడ్ న్యూస్ తెలుపలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: