
అల్లు అర్జున్ పుష్ప2 సినిమాకు 27 శాతం బిజినెస్ లో వాటా తీసుకున్నారని 240 కోట్ల రూపాయలు పారితోషికంగా దక్కిందని తెలుస్తోంది. అట్లీ సినిమాకు పారితోషికం తీసుకుంటున్న బన్నీ త్రివిక్రమ్ సినిమాకు మాత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లింక్ చేయడం ద్వారా లాభాల్లో వాటా దక్కేలా చేస్తున్నారని తెలుస్తోంది. జాక్ సినిమాకు సిద్ధు జొన్నలగడ్డ నైజాం ఏరియా హక్కులు తీసుకున్నారని సమాచారం అందుతోంది.
ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలకు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా భాగస్వామిగా వ్యవహరించనుండగా సితార ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లలో నెల్సన్ తారక్ సినిమా ఉండనుందని భోగట్టా. ప్రభాస్, రామ్ చరణ్ మాత్రం పారితోషికం తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ కూడా లాభాల్లో వాటా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ సైతం తాను నటిస్తున్న తను నటిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు బ్యానర్ యాడ్ చేసి లాభాల్లో వాటా తీసుకుంటున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ సెలబ్రిటీలు రాబోయే రోజుల్లో ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. టాలీవుడ్ సెలబ్రిటీల కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. టాలీవుడ్ స్టార్ హీరోలు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టాలీవుడ్ స్టార్స్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇతర భాషల్లో సైతం టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్స్ సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.