టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి నాగ చైతన్య కొన్ని సంవత్సరాలు క్రితం మజిలీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సమంత హీరోయిన్గా నటించగా ... శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 2019 వ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల అయ్యింది. ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి ఆరు సంవత్సరాల కంప్లీట్ అయిన సందర్భంగా ఈ మూవీ కి మొత్తంగా వచ్చిన కలెక్షన్లు ఎన్ని ..? ఈ సినిమా ద్వారా బయ్యర్లకు ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 13.86 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 4.69 కోట్లు , ఉత్తరాంధ్రలో 4.78 కోట్లు , ఈస్ట్ లో 1.98 కోట్లు , వేస్ట్ లో 1.51 కోట్లు , కృష్ణ లో 2.11 కోట్లు , గుంటూరులో 2.33 కోట్లు ,  నెల్లూరులో ఒక కోటి , మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 32.26 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక కర్ణాటకలో 3.09 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 96 లక్షలు , యూఎస్ఏ లో 3.3 కోట్ల , రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 62 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 40.23 కోట్ల కలెక్షన్లు దక్కాయి. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ ఫార్ములా తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమాకు 18.2 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ సినిమా ద్వారా బయ్యర్లకు 18.2 కోట్ల లాభాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

nc