టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి నితిన్ తాజాగా రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి శ్రీ లీల , నితిన్ కి జోడిగా నటించింది. ఛలో , భీష్మ మూవీ లతో మంచి విజయాలను అందుకొని దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మూవీ లో ఓ చిన్న క్యామియో పాత్రలో నటించగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ మూవీకి మ్యూజిక్ ను అందించాడు. మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాను మార్చి 28 వ తేదీన పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యింది. ఈ 8 రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.


8 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 2.30 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 72 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 8 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.32 కోట్ల షేర్ ... 10.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 8 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 41 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 81 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 8 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 6.54 కోట్ల షేర్ ... 13.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 28.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా మరో 21.96 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: