దాదాపు రెండు సంవత్సరాల క్రితం మ్యాడ్ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. మ్యాడ్ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో మ్యాడ్ మూవీ విడుదల అయిన కొంతకాలానికి ఈ సినిమాకు కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ అనే సినిమాను రూపొందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక మ్యాడ్ స్క్వేర్ మూవీ ని ఈ సంవత్సరం మార్చి 28 వ తేదీన పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల చేశారు. మొదటి నుండి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ ఫుల్ జోష్లో ముందుకు సాగిపోతుంది. ఇకపోతే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చి , సూపర్ కలెక్షన్లు దక్కుతూ ఉండడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఇకపోతే మ్యాడ్ స్క్వేర్ మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించిన రేబా మౌనిక జాన్ కూడా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ కు విచ్చేసింది. ఇక ఈ సినిమా ఈవెంట్ కు ఈ బ్యూటీ అదిరిపోయే వేరే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని వచ్చింది. 

దానితో మ్యాడ్ స్క్వేర్ మూవీ సక్సెస్ ఈవెంట్ లో రేబా మౌనిక జాన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దానితో మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలన్నీ ఈ బ్యూటీ వైపు తిరిగాయి. దానితో ప్రస్తుతం మ్యాడ్ స్క్వేర్ మూవీ సక్సెస్ ఈవెంట్లో భాగంగా రేబా మౌనిక జాన్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే మ్యాడ్ స్క్వేర్ మూవీలోని స్పెషల్ సాంగ్ ద్వారా రెబా మౌనిక జాన్ కి మంచి గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: