ప్రస్తుత కాలంలో సినిమాలు ఎంత బాగా తీశాము అనే దాని కంటే కూడా సినిమాను ఎంత బాగా ప్రమోట్ చేశామో అనేదే ఎంతో ముఖ్యంగా మారింది. ఎందుకు అంటే సినిమాను ఎంత గొప్పగా తీసిన కూడా దానికి కావలసిన ప్రచారాలను సరిగ్గా నిర్వహించినట్లయితే సినిమా వచ్చింది పెద్దగా ఎవరికి తెలియదు. దానితో సినిమాకు పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉండదు. దానితోనే సినిమా ఎంత బాగా తీసిన ప్రచారాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించి ఈ మధ్య కాలంలో మేకర్స్ పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇకపోతే మరి కొన్ని రోజుల్లో విడుదలకు రెడీ అయిన మూడు మూవీ బృందాలు ప్రస్తుతం ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ తాజాగా జాక్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించగా ... బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో ఈ మూవీ బృందం వారు పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇకపోతే యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రదీప్ మచిరాజు తాజాగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వారు కూడా పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నారు. నటుడు మరియు నిర్మాత అయినటువంటి కళ్యాణ్ రామ్ తాజాగా అర్జున్ S/O వైజయంతి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు కూడా భారీ ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇలా ఈ మూడు మూవీ బృందాల వారు ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తూ ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: