
చాలా కాలం తర్వాత అలా వైకుంఠపురం సినిమా తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన టబు అందులో తల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమాతో మంచి మార్కులే పడ్డాయి కానీ ఆ తర్వాత ఎందుకో తెలుగులో అవకాశాలు ఇచ్చేందుకు కూడా దర్శక,నిర్మాతలు వెనుకడుగు వేశారు.ఈ తరుణంలోనే తాజాగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరోయిన్ టబుకు ఒక ఆఫర్ ఇచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తను నెక్స్ట్ తెరకెక్కించే చిత్రంలో లేడీ విలన్ పాత్ర కోసం హీరోయిన్ టబు ని అడిగినట్లు వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఒక ఊర మాస్ గా విజయ్ సేతుపతి కనిపించబోతున్నారట. ఇందులో ఒక కీలకమైన పాత్రలోనే టబు నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .మరి ఇందులో కూడా నెగిటివ్ షేడ్స్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఇందుకు టబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం .మరి ఈ విషయం పైన అధికారికంగా చిత్ర బృందం ఇంకా ప్రకటించాల్సి ఉన్నది. ఈ ఏడాది మే నెలలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారట. మరి అఫీషియల్ గా చిత్ర బృందం ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి మరి. మరి 53 ఏళ్ల వయసులో లేడీ విలన్ గా టబు అదరగొట్టేస్తుందని అభిమానులు ధీమాతో ఉన్నారు