
ఇక అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఈమె ఆరోగ్యం విషమించడంతో జాక్వెలిన్ తల్లి తుది శ్వాస విడిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .ఇటీవలే జాక్వెలిన్ హాస్పిటల్ కి వెళ్లినటువంటి వీడియో కూడా బయటికి రావడంతో అభిమానులు సినీ సెలబ్రెటీలు కూడా జాక్వెలిన్ ఫెర్మాండెజ్ తల్లి మృతికి సంతాపం ని తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మరి కొంతమంది మాత్రం ధైర్యంగా ఉండాలంటు జాక్వెలిన్ ఫెర్మాండెజ్ ఓదారుస్తూ ఉన్నారు.ఇక అంత్యక్రియలకు సంబంధించి అన్ని విషయాలను కూడా సీక్రెట్ గానే పూర్తి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జాక్వెలిన్ ఫెర్మాండెజ్ సినిమాల విషయానికి వస్తే మొదట మోడల్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత నటన మీద ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఏమి పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి పేరు సంపాదించింది. ఇక టాలీవుడ్ లో సాహో సినిమాలో స్పెషల్ సాంగ్లో నటించిన ఈ అమ్మడు హరిహర వీరమల్లు తదితర చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నది. తెలుగులోనే కాకుండా తమిళం చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నది. చివరిగా ఫతే అనే సినిమాలో కూడా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది.