అలేఖ్య చిట్టి పికిల్స్ ప్రస్తుతం ఎక్కడ చూసినా అలేఖ్య సిస్టర్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. రాజమండ్రి కి చెందిన ఈ ముగ్గురు అక్క చెల్లెల్లు నాన్ వెజ్ పచ్చళ్ళ వ్యాపారంతో బాగా ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో ఓ వెబ్సైట్ కూడా ఓపెన్ చేశారు. ఈ ముగ్గురు అక్క చెల్లెలు పచ్చళ్ళ వ్యాపారం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. అయితే ఓ వ్యక్తి పచ్చళ్ళు కొనాలని మెసేజ్ చేశాడు. నాన్ వెజ్ పచ్చళ్ళ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని ఓ కస్టమర్ మెసేజ్ చేశాడు. దీంతో కోపంతో చెలరేగిపోయిన అలేఖ్య చిట్టి అసభ్యకరమైన పదజాలంతో రిప్లై ఇచ్చింది.



ముష్టి పికిల్స్ కొనలేని నువ్వు నీ భార్యకు బంగారం ఏం కొనిపెడతావు భవిష్యత్తులో నువ్వు బాగా డబ్బులు సంపాదించిన తర్వాతనే వివాహం చేసుకో. కెరీర్ మీద నువ్వు బాగా ఫోకస్ పెట్టాలి అంటూ బండ బూతులు తిట్టింది. అంతే ఈ వీడియోను ఆ కస్టమర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.... అది క్షణాల్లోనే వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇప్పుడు వారం రోజుల నుంచి ఎక్కడ చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లపై విపరీతంగా ట్రోల్స్, కామెంట్లు వస్తున్నాయి. దీంతో అలేఖ్య చిట్టి పికిల్స్ వెంటనే వెబ్సైట్ క్లోజ్ చేసి, వాట్సాప్ ను సైతం డిలీట్ చేశారు. అలా చేస్తే ఈ గొడవ పెద్దది కాదు అని అనుకున్నారు కానీ ఈ వివాదం తారస్థాయికి చేరుకుంది.


 అనంతరం ఈ ముగ్గురు అక్క చెల్లెలు క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇప్పటివరకు నేను తిట్టిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను అంటూ వీడియోలను వరుసగా రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఈ వివాదం ఏమాత్రం ఆగడం లేదు. అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ వైరల్ చేస్తున్నారు. మళ్లీ ఎప్పటిలానే అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారాన్ని ప్రారంభిస్తారా లేదా అనే సందేహంలో చాలామంది ఉన్నారు.


ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి తిట్టిన అబ్బాయిని వివాహం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నువ్వు ఎవరినైతే తిట్టావో ఆ అబ్బాయిని వివాహం చేసుకోవాలని ఎందుకంటే ముష్టి పికిల్స్ కొనలేనివాడు అని ఆ అబ్బాయికి సమాజంలో చెడ్డ పేరు తీసుకువచ్చావు. ఆ అబ్బాయిని వివాహం చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు వస్తుంది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆ అబ్బాయిని నువ్వే తప్పకుండా వివాహం చేసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు. ఈ  కామెంట్ల పైన అలేఖ్య సిస్టర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: