టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కొంతమంది వారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినీ ఇండస్ట్రీలోకి నటులుగా ఎంట్రీ ఇస్తారు. అలాంటి వారిలో నటి మంచు లక్ష్మి ఒకరు. మోహన్ బాబు వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మంచు లక్ష్మి తన నటనతో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. తన నటనతో ఈ బ్యూటీ ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఈ బ్యూటీ సినిమాల్లో నటించడమే కాకుండా నిర్మాతగాను వ్యవహరిస్తోంది. 


మంచు లక్ష్మి నటించిన సినిమాలుకు ఎన్నో అవార్డులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిన్నది ఎప్పుడు బిజీగా ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో సమయాన్ని గడుపుతూ ఉంటుంది. తన అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటుంది. తనకు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ అభిమానులకు చేరువలో ఉంటుంది మంచు లక్ష్మి. కాగా ప్రస్తుతం మంచు లక్ష్మి ముంబైకి వెళ్లారు. అక్కడ ఓ కేఫ్ లో రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి ఇద్దరు కలిసి లోపలికి వెళ్లారు. 


ఆ తర్వాత బయటకు వచ్చే క్రమంలో ఇద్దరు కలిసి ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. రకుల్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ తెలుగుతో పాటు హిందీలోను అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తుంది. 


వివాహమైనప్పటికీ రకుల్ ఎప్పటిలానే సినిమాలు చేయడంతో తన అభిమానులు సంతోషపడుతున్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది రకుల్. అంతేకాకుండా ఈ చిన్నది వివాహం తర్వాత తన అందాల ఆరబోతలో ఏమాత్రం రాజీ పడడం లేదు. గ్లామర్ ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా ఆ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: