టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నటి ఐశ్వర్య రాజేష్ ఒకరు. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ చిన్నది రీసెంట్ గా నటించిన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ మాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా  ఐశ్వర్య రాజేష్ తన కెరీర్ కొనసాగిస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ కు భార్య పాత్రలో అద్భుతంగా నటించింది.



తన అమాయకమైన నటన, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఈ సినిమాతో ఈ చిన్నది బ్లాక్ బస్టర్ హిట్ సినిమానూ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనంతరం ఐశ్వర్య రాజేష్ కు వరుసగా తెలుగులో సినిమా అవకాశాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిన్నది వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. ఆ ఇంటర్వ్యూలలో భాగంగా ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ సమయంలోనే ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన మనసులోని మాటను బయటపెట్టింది.


అందరి హీరోయిన్ల లాగా నాకు తెల్ల తోలు లేదు అంటూ సంచలన కామెంట్లు చేసింది. నా కలర్ గురించే నన్ను చాలామంది ఎగతాళి చేశారు. కానీ నేను అదేమీ పట్టించుకోలేదు. నా దేశంలో అందరిలానే నాకు కూడా నాచురల్ స్కిన్ కలర్ ఉంది. నాకు నా కలర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇదే రియల్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అంటూ ఐశ్వర్య రాజేష్ సంచలన కామెంట్లు చేశారు.


ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. కాగా ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వారి మనసులను దోచుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ చిన్న దానికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: