పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో తన నటనతో మంచి గుర్తింపు అందుకున్నాడు. మొదటి సినిమాతోనే సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా తన హవాను కొనసాగించాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే పవన్ కళ్యాణ్ మరోవైపు బిజినెస్ లు కూడా చేసేవాడు. అంతేకాకుండా రాజకీయాల్లోనూ తన వంతు పాత్రను పోషిస్తున్నాడు.



రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించాడు. అంతేకాకుండా మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూడా బాధ్యతలు తీసుకున్నాడు. జనసేన పార్టీ స్థాపించిన పది సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ పదవిని ఇప్పించాడు. ఇదిలా ఉండగా.... పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా బిజీగా ఉంటున్నారు. ఎన్నికలలో విజయాన్ని అందుకున్న తర్వాత సినిమాలలో పవన్ కళ్యాణ్ పెద్దగా నటించడం లేదు.

అంతకుముందు ఒప్పుకున్న సినిమా ప్రాజెక్టులకు మాత్రమే పవన్ కళ్యాణ్ సమయం కుదిరినప్పుడు షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చాలా కాలం నుంచి పెండింగ్ లో పడింది. కొంతవరకు షూటింగ్ పూర్తయినప్పటికీ మరికొంత సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లను పవన్ కళ్యాణ్ వచ్చే వారంలో పూర్తి చేయనున్నట్లుగా సమాచారం అందుతుంది.


వచ్చే వారంలో పవన్ కళ్యాణ్ కు సమయం ఉన్నందున షూటింగ్ కు 5 రోజుల సమయాన్ని కేటాయించినట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఓవైపు పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన అభిమానుల కోరిక మేరకు సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో పాటు OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లలో కూడా పాల్గొనాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ను కూడా త్వరలోనే పూర్తి చేస్తారని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: