హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి  మనకు తెలిసిందే.ఈ మధ్యనే నితిన్ హీరో గా నటించిన రాబిన్ హుడ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించినప్పటికీ ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. దాంతో తన నెక్స్ట్ సినిమా ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే చాలా రోజుల నుండి శ్రీలీల బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ తో ప్రేమలో ఉంది అనే రూమర్లు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే వీరిద్దరి కాంబోలో సినిమా రావడంతో వీరి మధ్య డేటింగ్ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కార్తిక్ ఆర్యన్ తో కలిసి వెళ్తున్న శ్రీలీలకి ఒక చేదు అనుభవం ఎదురయింది. అందరి ముందే లాగి హీరోయిన్ శ్రీలీలను కొంతమంది ఆకతాయిలు ఏడిపించారు. మరి ఇంతకీ శ్రీలీలకి జరిగిన ఆ చేదు అనుభవం ఏంటో ఇప్పుడు చూద్దాం. 

కార్తిక్ ఆర్యన్ శ్రీ లీల ఇద్దరు ఓ లవ్ స్టోరీ లో నటిస్తున్నారు. ఈ లవ్ స్టోరీకి మొదట ఆషిక్యూ 3 అనే టైటిల్ పెట్టినప్పటికీ వివాదాలు తలెత్తడంతో ఆ టైటిల్ ని తొలగించారు.అయితే ఈ సినిమాకి అనురాగ్ బసూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్ డార్జిలింగ్ లో పూర్తి చేశారు. అయితే డార్జిలింగ్ షూట్ పూర్తయ్యాక అభిమానుల శ్రీలీల కార్తిక్ ఆర్యన్ ని చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు.ఇందులో భాగంగా అక్కడికి వచ్చిన అభిమానులు అందరినీ ప్రేమగా పలకరించుకుంటూ కార్తీక్ ఆర్యన్ ముందు వెళ్లారు.ఆయన వెంటే శ్రీలీల కూడా వచ్చింది. ఇక వీరిద్దరు చుట్టూ పదుల కొద్ది బాడీ గార్డ్లు కూడా ఉన్నారు. అయితే అంత మంది మధ్యలో కార్తీక్ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా శ్రీలీల కూడా ఆయన వెనకే వెళుతుంది.

కానీ సడన్గా కొంతమంది ఆకతాయిలు శ్రీలీల చేయి పట్టుకొని గట్టిగా లాగి వాళ్ళ వైపు లాక్కెళ్లారు.దాంతో శ్రీ లీల కొద్దిసేపు షాక్ అయిపోయింది. ఆ తర్వాత అక్కడే ఉన్న బాడీగార్డ్లు ఆ ఆకతాయిల నుండి శ్రీలీలని విడిపించి మళ్లీ సేఫ్ గా తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ఈ వీడియో పై ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కానీ శ్రీలీల అభిమానులు మాత్రం శ్రీ లీల చేయి పట్టుకుని లాగింది ఎవడ్రా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అభిమానులను పలకరించడానికి వెళ్లిన శ్రీలీలకు ఇది ఒక చేదు అనుభవం అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: