ఏంటి 65 ఏళ్ల మోహన్ లాల్ తో 30 ఏళ్ల హీరోయిన్ ప్రిమాయణమా..ఇది నిజమేనా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఉంది ఎంత వరకు నిజం..ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. తాజాగా సోషల్ మీడియాలో మోహన్లాల్ ఓ నటితో ఉన్న ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మాళవిక మోహనన్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ మూవీలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరైన మాళవిక మోహనన్.. ప్రభాస్ తో పాటు మలయాళ నటుడు మోహన్లాల్ తో కలిసి హృదయపూర్వం సినిమాలో కూడా నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయింది.ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన ఈ షూటింగ్ కి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోవడంతో ఈ సినిమాకి సంబంధించి అలాగే సినిమాలో నటించిన ఆర్టిస్టులు సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ తో, డైరెక్టర్ తో, నిర్మాతతో ఏర్పడ్డ అనుబంధాన్ని మాళవిక మోహనన్ ఒక పోస్ట్ ద్వారా షేర్ చేసుకుంది.

అయితే ఆ పోస్టులో మాళవిక మోహన్ ఈ విధంగా రాసుకువచ్చింది.ఓ సినిమా పూర్తి చేసుకుంటే ఆ సినిమాలో కలిసి నటించిన వారి మధ్య బాండింగ్ పెరుగుతుంది  వారి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అయితే కొత్త వారితో సినిమా చేసినప్పుడు వాళ్లు ఫ్రెండ్స్ అవుతారు.కానీ కొద్ది మంది మాత్రమే ఓ కుటుంబం లాగా మారతారు.అలాంటి వారిలో వీళ్లు కూడా ఒకరు.. సత్యం సార్,మోహన్ లాల్ సార్ నుండి నేను ఎన్నో నేర్చుకున్నాను. అలాగే వారందరు ఓ కుటుంబం లాగే కలిసిపోయారు  వారితో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు నాకు ఎంతగానో హ్యాపీగా ఉంది.ఇలాంటి గొప్ప వారితో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీ. అలాగే మోహన్లాల్ సార్ తో చేసే అవకాశం రావడం నా అదృష్టంగా చెప్పుకుంటాను అంటూ మాళవిక మోహనన్ పోస్ట్ చేసింది.అయితే సెలబ్రెటీలు పోస్టులు పెడితే దాని కింద కొంతమంది ఆకతాయిలు రకరకాల నెగిటివ్ కామెంట్లు పెడతారు.

అలా మాలవిక మోహనన్ పెట్టిన పోస్ట్ కి కూడా ఓ వ్యక్తి షాకింగ్ కామెంట్ పెట్టాడు. 65 ఏళ్ల వయసున్న ముసలి హీరోకి 30 ఏళ్ల వయసు ఉన్న హీరోయిన్ తో ప్రేమాయణం.. ఇదేంటో అర్థం అవ్వడం లేదు..ముసలి హీరోలు తమ ఏజ్ కు తగ్గట్టు పాత్రలు ఎందుకు ఎంచుకోవడం లేదో అర్థం అవ్వడం లేదు అంటూ షాకింగ్ కామెంట్ పెట్టాడు. అయితే ఈ కామెంట్ చూసిన మాళవిక మోహనన్ స్పందిస్తూ.. నేను ఈ సినిమాలో అతనితో ప్రేమలో పడ్డాను అని నీకు ఎవరైనా చెప్పారా.. నువ్వు ఎందుకు ఊహించుకుంటున్నావ్.. నీ ఊహల్లో నీవు ఏదేదో ఊహించుకొని కథలు అల్లేసుకొని ఇతరులను నిందించడం మానుకో అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.ప్రస్తుతం మాళవిక మోహనన్ ఆ నెటిజన్ కి ఇచ్చిన రిప్లై నెట్టింట వైరల్ అవ్వడంతో మాళవిక మోహనన్ పెట్టిన పోస్ట్ కి పలువురు నెటిజన్స్ మద్దతు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: