టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకప్పటి నటీ మణులు వారి నటన అంద చందాలతో మంచి గుర్తింపును అందుకున్నారు. అలాంటి వారిలో నటి కుష్బూ ఒకరు. ఈ బ్యూటీ ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది కుష్బూ. ఇక సినిమాల పరంగా అతన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే దర్శకుడు సుందర్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. 



వివాహం తర్వాత ఓ బిడ్డ కు జన్మనిచ్చింది. ఇక కుష్బూ వివాహం తర్వాత కూడా ఎప్పటిలానే వరుసగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తుంది. ఈ మధ్యకాలంలో కేవలం అమ్మ, అత్త వంటి కీలకమైన పాత్రల లో నటిస్తోంది. అంతేకాకుండా పలు ప్రోగ్రామ్ లలో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ఇక సినీ ఇండస్ట్రీలోకి వారసులు హీరోయిన్లుగా పరిచయం అవడం చాలా కామన్ అయిపోయింది.


ఈ క్రమం లోనే నటి కుష్బూ, సుందర్ ల కూతురు అవంతిక సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అవంతిక సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోలు చూసిన అభిమానులు సినీ ఇండస్ట్రీ కి కొత్త హీరోయిన్ వచ్చేసిందని కామెంట్లు చేస్తు న్నారు. అయితే గతం లోనే అవంతిక నటన అంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించారు.

నటించాలని తన మనసులో ఎంతగానో ఉందని అన్నారు. కానీ సినిమాలలో నటించాలనే విషయాన్ని ఎప్పుడూ కూడా సీరియస్ గా తీసుకోలేదంటూ అవంతిక గతంలోనే వెల్లడించారు. మరి ఇప్పుడు అవంతిక సినిమాలలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారా లేదా అనే సందేహంలో అభిమానులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: