తెలుగు సినీ ఇండస్ట్రీలో రోజు రోజుకి ఎంతోమంది కొత్త హీరోయిన్లు పరిచయం అవుతూనే ఉన్నారు. అందులో కొంతమంది హీరోయిన్లు సక్సెస్ అవ్వగా మరి కొంతమంది విఫలం అవుతున్నారు. బేబీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన నటి వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది మొదట షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. షార్ట్ ఫిలిమ్స్ తో విపరీతంగా క్రేజ్ దక్కించుకున్న ఈ చిన్నది వరుసగా షార్ట్ ఫిలిమ్స్ చేసి సక్సెస్ఫుల్ గా తన కెరీర్ కొనసాగించింది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ చిన్నదాని నటన, అందానికి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో వైష్ణవి పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తుంటాయి.



ఈ చిన్నది బేబీ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ చిన్నది లవ్ మీ సినిమాలోను నటించింది. రొమాంటిక్ హారర్ త్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన లవ్ మీ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఈ చిన్నది ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరో సిద్దు జొన్నలగడ్డతో కలిసి జాక్ సినిమాలో నటించింది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య కాంబినేషన్లో ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జాక్ చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అందులో భాగంగా వైష్ణవి చైతన్య తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. తన ఫస్ట్ క్రష్ హీరో రామ్ పోతినేని అని చెప్పారు. తనకు రామ్ అంటే ఎంతగానో ఇష్టమని అన్నారు.


అంతే కాకుండా రామ్ తో కలిసి నటించే అవకాశం వస్తే అసలు వదులుకోనని, తప్పకుండా నటిస్తానంటూ వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను మొదటిసారి నటించిన సమయంలో తనకు కేవలం 3000 రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే వచ్చిందని చెప్పారు. తనకు బిర్యానీ అంటే చాలా ఇష్టమని అన్నారు. తనకు సాయి పల్లవి, అనుష్క హీరోయిన్లు అంటే చాలా ఇష్టమని వారే తనకు రోల్ మోడల్ అంటూ వైష్ణవి చైతన్య ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ చిన్నది షేర్ చేసుకున్న విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: