టాలీవుడ్ లో ఒకప్పుడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టాప్ లో ఉండేవారు. ఆయన సినిమా తీస్తే చాలు ప్రేక్షకులు సైతం ఎగబడేవారు. ఆయనతో కలిసి సినిమా చేయాలని చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్ లు ఎదురుచూసే వాళ్లు. పూరీ సినిమా చేయమని అడిగితే చాలు స్టోరీ కూడా ఆడగకుండా డేట్స్ ఇచ్చేవాళ్లు. అయితే అప్పుడు టాప్ లో ఉన్న పూరీ జగన్నాథ్ ఇప్పుడు కనుమరుగు అయిపోయాడు. అసలు ఆయన సినిమాలు సంవత్సరానికి ఒక్కటి కూడా విడుదల అవట్లేదు. ఒకవేళ రిలీజ్ అయిన కూడా ఫ్లాప్ టాక్ ని మాత్రమే అందుకుంటున్నాయి. ఇటీవల లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు తెరకెక్కించి ఓటమి పాలయ్యాడు.

అయితే ఇప్పుడు హిట్ కొట్టేందుకు పూరీ జగన్నాథ్ సిద్ధం అయ్యాడు. డైరక్టర్ పూరీ జగన్నాథ్, స్టార్ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేయనున్నారు. అయితే ఫ్లాప్ లలో ఉన్న పూరీ జగన్నాథ్ సినిమాకు విజయ్ సేతుపతి ఒప్పుకోవడంతో అందరూ ఆశ్చర్య పోయారు. కొందరు ఏమో పూరీ జగన్నాథ్ ఈసారి మంచి స్కెచ్ తో సినిమా చేస్తున్నాడని అంటున్నారు. అందుకే విజయ్ సేతుపతి కూడా సినిమాకు ఒకే చేశాడని సమాచారం.

ఇకపోతే వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర ఉంటుంది అంట. ఆ ముఖ్యపాత్రలో ఓ సీనియర్ హీరోయిన్ ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనుంది అంట. అయితే ఆ సీనియర్ హీరోయిన్ ఎవరు అని ఆలోచిస్తున్నారు. తాను మరెవరో కాదు స్టార్ నటి టబు. ఈ అందాల భామకి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అయితే టబు ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: