సినీ ప్రియులకి శుభవార్త. ఎందుకంటే ఓటీటీలో సూపర్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో టెస్ట్ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. టెస్ట్ లో బ్యూటీ నయనతార, స్టార్ హీరోస్ మాధవన్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఉద్వేగం సినిమా ఇప్పటికే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాని గతేడాది నవంబర్ లో థియేటర్ లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీని మహిపాల్ రెడ్డి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఉద్వేగం సినిమాలో త్రిగుణ్‌, దీప్సిక, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ముఖ్య పాత్రలలో నటించారు. అలాగే నేడు పూజిత పొన్నాడ, తులసి నటించిన ఉత్తరం సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సోనియా సింగ్, శ్రీహన్ నటించిన లైఫ్ పార్ట్ నర్ అనే సినిమా విడుదల అయింది ఈ సినిమా ఈటీవీ విన్ లో విడుదల అయింది.
 
ఇప్పటికే హోమ్ టౌన్ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో కీలక పాత్రలలో రాజీవ్ కనకాల, ఝాన్సీ నటించారు. నవదీప్, దీక్షిత్ శెట్టి నటించిన టచ్ మీ నాట్ మూవీ కూడా జియో హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. టుక్ టుక్ అనే సినిమా ఏప్రిల్ 10న ఓటీటీ విడుదల అయ్యి సందడి చేయనుంది. ఈ సినిమా మ్యాజిల్ పవర్స్ గురించి చూపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెళ్లి వీక్షించి, ఎంజాయ్ చేయండి.

 
ఇదిలా ఉండగా..  ఒక సూపర్ హిట్ సినిమా టచ్ మీ నాట్ ఓటీటీలో దూసుకెళ్తుంది. ఈ  సినిమాకి డైరెక్టర్ రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సిరీస్ ఒక క్రైమ్ థ్రిల్లర్. ఈ సిరీస్ టైలర్ ఎంతో మందిని ఆకట్టుకుంది. కొన్నిటిని ప్రాణం కన్నా ఎక్కువగా కాపాడుకోవాలి అని ఈ టైలర్ ద్వారా చూపించారు. ఎప్పుడెప్పుడ అంటూ సిరీస్ కోసం నెటిజన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. దీంతోపాటుగా లవ్ యాపా అనే రొమాంటిక్ కామిడీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో హీరోగా మహారాజ్ ఫేమ్ జునైద్ ఖాన్ నటించారు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ చెల్లి ఖుషీ కపూర్ నటించింది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: