
అయితే ఇప్పుడు తాజాగా పలువురు సినీ ప్రముఖులు యూట్యూబ్ ఛానల్స్ పైన పలు రకాల లీగల్ నోటీసులను సైతం హేమ జారీ చేసినట్లు తెలుస్తోంది. తన పరువుకు భంగం కలిగించారంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. హేమ లీగల్ నోటీస్ పంపించిన వారిలో ప్రముఖ నటి కరాటే కళ్యాణి, బిగ్బాస్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న తమన్నా సింహాద్రిలో పాటుగా పలువురు యూట్యూబ్ ఛానల్స్ పైన కూడా ఈమె లీగల్ నోటీసులు పంపించింది. వీరందరూ కూడా గతంలో తన పరువు ప్రతిష్టను సైతం భంగం కలిగించారంటూ వెల్లడించింది.
చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ఇలా నోటీసులు పంపించాను అంటూ తెలిపింది హేమ. గడిచిన కొద్ది రోజుల క్రితం తాను ఒక సమస్యలు ఇరుక్కున్నానని అయితే ఇప్పుడు వీరందరూ తనపై బురద చల్లే ప్రయత్నం చేశారని.. ఎవరు ఇష్టం వచ్చినట్లు తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారని.. నిజాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో మాట్లాడకూడదు.. కానీ అలాంటిది మీరు ఎన్నో అపార్ధాలు మాట్లాడారు ఈ వీడియోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి.. తాను తప్పు చేయకుండానే తనని బ్లేమ్ చేసేలా మాట్లాడారని.. అందుకే న్యాయస్థానం వరకు వెళ్లాను తన పరువుకు నష్టం కలిగింది అంటూ హేమ లీగల్ నోటీసులు పంపిందట.